Sunday, April 28, 2024

ఎస్ఐ రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు : సీపీ సుబ్బారాయుడు

ఎస్ఐ రాత పరీక్ష ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు పేర్కొన్నారు. ఆదివారం రెండవ రోజు ఎస్ఐ రాత పరీక్ష జరుగుతున్న కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ శనివారం ప్రారంభమైన పరీక్ష రెండవ రోజు ఆదివారం కొనసాగిందన్నారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో అభ్యర్థులకు జరుగనున్న రాత పరీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ఎస్ఐ అభ్యర్థుల రాత పరీక్ష కోసం కరీంనగర్, తిమ్మాపూర్, నుస్తులాపూర్లలో 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కరీంనగర్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల, తిమ్మాపూర్ లోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల, మహిళ ప్రభుత్వ డిగ్రీ మ‌రియు పీజీ కళాశాల, వివేకానంద డిగ్రీ మ‌రియు పీజీ కళాశాల, అపూర్వ డిగ్రీ కళాశాల, శ్రీ చైతన్య డిగ్రీ మరియు పిజి కళాశాల, ఎస్ఆర్ఆర్ కళాశాల, జేమ్స్ డిగ్రీ మరియు పిజి కళాశాల, వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాల, వికాస్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పిజి కళాశాలలో ఏర్పాట్లు చేశామన్నారు. నాలుగు పేపర్లు రాత పరీక్షను నిర్వహిస్తారని, ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 01 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు కొనసాగుతుందని తెలిపారు. రాత పరీక్షకు 13, 547 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని వివరించారు. సిపి వెంట డిసిపిలు చంద్రమోహన్, శ్రీనివాస్, ఏసిపిలు కర్ణాకర్ రావు, తుల శ్రీనివాసరావు, సిఐ రమేష్ తో పాటు పలువురు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement