Monday, May 6, 2024

Delhi | అష్టలక్ష్మికి మోదీ సర్కారు సంపూర్ణ సహకారం : కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధితోనే భారతదేశ అభివృద్ధి సంపూర్ణం అవుతుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. నిరాదరణకు గురైన ‘అష్ట లక్ష్మి’ రాష్ట్రాలకు మోదీ సర్కారూ సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన ‘నార్త్ ఈస్ట్ సమ్మేళన్’ కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అద్భుతమైన ప్రకృతి రమణీయతకు, భిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలకోసం కేంద్రప్రభుత్వం ఇప్పటి వరకు రూ.5లక్షల కోట్లు కేటాయించిందని వెల్లడించారు.

ప్రతి కేంద్రమంత్రిత్వ శాఖ బడ్జెట్ లో 10% ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేటాయిస్తోందన్నారు. గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న అస్థిరత కారణంగా సమస్యల్లోనే ప్రజలు, ప్రభుత్వాలు కాలం వెళ్లదీసేవని.. ప్రధాని మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో రాజకీయసుస్థిరత, శాంతియుత వాతావరణం ఏర్పడ్డాయని.. తద్వారా విద్యార్థులు, యువత విద్యాబాట పట్టారన్నారు. విద్య, వైద్యం, పర్యాటకం, మౌలికవసతులు,పరిశ్రమలు తదితర రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు.

వివిధ రంగాల్లో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి బాట పట్టాయని, ఇది మోదీ ప్రభుత్వం అనుసరించిన విధానం కారణంగానే సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ద్వారకలో నిర్మిస్తున్న నార్త్ ఈస్ట్ కల్చరల్ అండ్ సోషల్ ఇనిస్టిట్యూట్ శంకుస్థాపన, జేఎన్‌యూలో ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల కోసం నిర్మించిన ‘బరాక్’ హాస్టల్ ను కేంద్రమంత్రి ప్రారంభించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement