Tuesday, May 7, 2024

ఒకేసారి 20 మంది మంత్రుల రాజీనామా..!

ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ శ‌నివారం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న కేబినెట్‌లోని మంత్రులంద‌రినీ రాజీనామాలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రులంద‌రూ ఇవాళ రాజీనామా చేశారు. అదే స‌మ‌యంలో స్పీక‌ర్‌గా ఉన్న సూర్య‌నారాయ‌ణ పాత్రో కూడా ఆ ప‌ద‌వికి రాజీనామా చేశారు. సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ నేతృత్వంలోని బీజూ జ‌న‌తా ద‌ళ్ ప్ర‌భుత్వానికి అయిదోసారి మూడేళ్లు నిండాయి. ఈ నేప‌థ్యంలో మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చేప‌ట్ట‌నున్నారు. ఇందులో భాగంగానే మంత్రులు రాజీనామా చేసిన‌ట్లు తెలుస్తోంది. 2024 జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్ నేప‌థ్యంలో పార్టీని బ‌లోపేతం చేయాల‌న్న ఉద్దేశంతో మంత్రులు పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చేప‌ట్టారు. తాజా స‌మాచారం మేర‌కు 20 మంది మంత్రులు త‌మ రాజీనామాల‌ను ఒడిశా అసెంబ్లీ స్పీక‌ర్‌కు స‌మ‌ర్పించారు. ఇక రేపు ఉద‌యం 11.45 నిమిషాల‌కు రాజ్‌భ‌వ‌న్‌లో కొత్త మంత్రులు ప్ర‌మాణ స్వీకారం ఉంటుంది. ప్ర‌దీప్ అమ‌త్‌, ల‌తికా ప్ర‌దాన్‌ల‌కు మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా స్పీక‌ర్ సూర్య‌నారాయ‌ణ పాత్రోకు త‌న కేబినెట్‌లో కీల‌క మంత్రిత్వ శాఖ‌ను అప్ప‌గించ‌నున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement