Friday, May 10, 2024

రెండు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ – 36మంది అరెస్ట్ -3ఎఫ్ ఐఆర్ లు న‌మోదు

ఇటీవ‌ల మొహ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై ఓ బీజేపీ ప్ర‌తినిధి చ‌ర్చ‌లో అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ.. ముస్లిం మ‌త సంస్థ‌లు కాన్పూర్‌లో బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ స‌మ‌యంలో రెండు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు, ఒక పోలీసు గాయపడ్డారు. కాన్పూర్ హింసాకాండ పై పోలీసు కమిషనర్ విజయ్ సింగ్ మీనా మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉంది, భద్రతా బలగాలు ప్రతిచోటా మోహరించామ‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో 36 మందిని అరెస్టు చేసి 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం పరిస్థితి అదుపులో ఉందని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ తెలిపారు.

సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులను మోహరించామ‌నీ, కాన్పూర్‌లోని యతీం ఖానా, పరేడ్ క్రాస్‌రోడ్‌ల వ‌ద్ద భద్రతను కట్టుదిట్టం చేశామ‌ని తెలిపారు..ఈ ఘ‌ట‌న జరిగిన ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న ఫోటోలు, వీడియో ఆధారంగా మరింత మంది నిందితుల‌ను గుర్తిస్తున్న‌ట్టు తెలిపారు. గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కుట్ర దారులపై చర్యలు తీసుకుంటామ‌ని, వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం లేదా కూల్చివేయడం జరుగుతుందని ఆయన అన్నారు. కొందరు వ్యక్తులు దుకాణాలను మూసివేయడానికి ప్రయత్నించడంతో ఇతర వర్గం వ్యతిరేకించడంతో హింస మొదలైందని తెలిపారు.త్వరలోనే కుట్రదారులందరినీ, సంఘటన స్థలంలో ఉన్న వ్యక్తులను అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, NSA వాతావరణం ఉండేలా దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement