Tuesday, April 30, 2024

స్వీట్ హోమ్ ని ప్రారంభించిన.. మంత్రి మ‌ల్లారెడ్డి

హైదరాబాద్ లో అతి పెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో HITEX Exhibition Centre లో స్వీట్ హోమ్ ని మంత్రి మ‌ల్లారెడ్డి ప్రారంభించారు. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ మొదటిస్థానంలో ఉందని, రియల్ ఎస్టేట్ రంగం లో ప్రతీ సంవత్సరం హైదరాబాద్ లో మిగతా నగరాలకంటే ఎక్కువ స్థాయిలో లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ కంపనీలను గా సంప్రదించి చిన్న, మధ్యతరగతి, పెద్ద అన్ని వర్గాల వారికీ అందుబాటు ధరల్లో అన్ని అప్రూవల్స్ తో ప్రాపర్టీ కొనాలనుకున్న వారికి ఇది సరైన వేదిక అని అన్నారు. సొంత ప్రాపర్టీ కొనాలకున్న వారు ఈ అవకాశాన్ని వినియోంచుకోవాలని సూచించారు. TV9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ & ఇంటీరియర్స్ ఎక్స్‌పో.. రియల్ ఎస్టేట్ డెవలపర్లు, అత్యాధునిక ఫర్నిచర్ ఎంపికలు, ఫర్నిషింగ్ బ్రాండ్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు, హోమ్ డెకర్ ఆప్షన్‌లతో విస్తృత శ్రేణిని ఈ ఎక్స్ పోలో చూడొచ్చు. అలాగే ఆర్థిక సహాయం పొందాలనుకునే కస్టమర్లు బ్యాంకులు అందించే రుణాలపై సమాచారాన్ని పొందవచ్చు. ఈ సేవలన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయి.ఈ కార్యక్రమం హైటెక్ సిటీ లోని HITEX Exhibition Centre లో ఆదివారం వరకు జరగనుంది. ప్రవేశం ఉచితం.

Advertisement

తాజా వార్తలు

Advertisement