Thursday, May 2, 2024

Meta | ఇన్‌స్టాగ్రామ్‌లో మ‌రో కొత్త ప్రైవ‌సీ ఫీచ‌ర్.. డేటా మరింత సేఫ్

ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల ప్రైవసీ కోసం మెటా యాక్టివిటీ ఆఫ్ ఫీచర్‌ను ప్రారంభించింది. మెటా 2021లో ఒక ప్రైవసీ పాలసీని ప్రవేశపెట్టింది. యూజ‌ర్స్ వాట్సాప్ డేటాను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తమ భాగస్వామి కంపెనీలతో పంచుకోవచ్చు. ఈ డేటా వినియోగదారులకు పర్సనలైజ్డ్ యాడ్స్‌ను చూపడానికి ఉపయోగించబడుతుంది. కాగా, ఇప్పుడు వ‌చ్చిన కొత్త అప్డేట్ తో ఈ మెటా యాక్టివిటీపై వినియోగదారులకు నియంత్రణను ఇచ్చింది కంపెనీ. అంటే వినియోగదారులు తమ డేటాను మెటా యాక్సెస్ చేయకూడదు అనుకుంటే వారు డేటాను తొలగించవచ్చు. అలాగే వారి ప్రత్యేక కార్యకలాపాలను కూడా డిస్‌కనెక్ట్ చేయవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని ఏదైనా ఇతర వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా సేకరించే ప్రక్రియను బ్లాక్ చేయవచ్చు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్రకటనలు, సమాచారాన్ని అందించడానికి కంపెనీలు ఈ సమాచారాన్ని ఉపయోగిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది అగ్రెసివ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇందులో కుకీల సహాయంతో వినియోగదారుల సెర్చ్ హిస్టరీ ట్రాక్ అవుతుంది.

వారికి ఏం ఇష్టమో కూడ తెలుస్తుంది. ఇప్పటివరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వినియోగదారులకు తెలియకుండా డేటా తీసుకుంటున్నారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఇన్‌స్టాగ్రామ్ నుంచి వినియోగదారులకు సంబంధించిన‌ ఏదైనా సమాచారం తీసుకోవాలంటే, మొదట యూజర్ నుంచి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. వినియోగదారులు కోరుకుంటే వారు డేటాను సేకరించే యాప్‌లు, వెబ్‌సైట్‌లను కూడా బ్లాక్ చేయవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement