Tuesday, October 8, 2024

IND vs SA | క్రికెట్ అభిమానులకు నిరాశే.. తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణం !

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మొద‌టి టీ20 ర‌ద్ద‌య్యింది. టాస్ కూడా ప‌డ‌కుండానే ఈ మ్యాచ్ ను ర‌ద్దు చేయాల్సి వ‌చ్చింది. మ్యాచు ప్రారంభానికి ముందు నుంచే ప్రారంభ‌మైన‌ వర్షం.. ఎంత సేపటికి ఆగకపోవడంతో మ్యాచును రద్దు చేశారు అంపైర్లు. వర్షం ఆగుతుందని భావించనప్పటికీ.. ఆగకపోవడంతో అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.

ఇక.. ఈనెల 12న రెండో టీ20 మ్యాచ్ సెయింట్ జార్జ్ పార్క్, గ్కెబెర్హాలో.. 14న మూడో టీ20 మ్యాచ్ జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో జరగనుంది .వన్డే మ్యాచ్ లు.. తొలి వన్డే డిసెంబర్ 17న జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో, రెండో వన్డే డిసెంబర్ 19న సెయింట్ జార్జ్ పార్క్, గ్కెబెర్హాలో, మూడో వన్డే డిసెంబర్ 21న బోలాండ్ పార్క్ లో జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement