Thursday, May 2, 2024

టాంజానియాలో ఎంజాయ్ చేసిన రామ్ చరణ్ ..ఉపాసన.. వీడియో పోస్ట్

టాంజానియాలోని సఫారీలో సింహాలను దగ్గరుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫొటోలు తీశారు. రామ్ చరణ్ ఫొటోలు తీస్తున్న వీడియోను ఆయనే స్వయంగా కొన్ని రోజుల క్రితం ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. బహిరంగ ప్రదేశంలో ఆమ్లెట్ కూడా వేశాడు. తమ పర్యటనకు సంబంధించి తాజా దృశ్యాలతో కూడిన షార్ట్ వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో రామ్ చరణ్ భార్య ఉపాసన పోస్ట్ చేశారు. ఇందులో ఎక్కువ సింహాలు కనిపిస్తున్నాయి. అలాగే, రామ్ చరణ్, ఉపాసన నేలపై సేద తీరడం, ఓ చెట్టు దగ్గరకు చేరి ఫొటోలు తీసుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు. గత నెల 20న జపాన్ వెళ్లిన ఈ జంట అటు నుంచి అటే ఆఫ్రికాకు వెళ్లి.. అక్కడి అందాలను దర్శించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement