Wednesday, May 15, 2024

భారీగా తగ్గిన కరోనా కేసులు.. 24 గంటల్లో 1581 పాజిటివ్‌లు

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1581 కొత్త కేసులు నమోదయ్యాయి. 33 మంది చనిపోయారు. మంగళవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన రిపోర్టు ప్రకారం.. సోమవారం 5.68 లక్షల మంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 1581 మందికి పాజిటివ్‌ వచ్చింది. వైరస్‌ వ్యాప్తి గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్రియాశీల కేసులు 23,913కు తగ్గాయి. సోమవారం 2,417 మంది కరోనా నుంచి కోలుకున్నారు. క్రియాశీల రేటు 0.06 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు 98.74 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు 4.30 కోట్ల మందికి కరోనా సోకింది. 4.24 కోట్ల మంది కరోనాను జయించారు. 5.16 లక్షల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జోరుగా సాగుతున్నది. సోమవారం ఒకే రోజు దేశ వ్యాప్తంగా 30,58,879 మంది టీకా తీసుకున్నారు. ఇప్పటి వరకు 181 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా కోరలు చాస్తుండటంతో.. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ.. బూస్టర్‌ డోసు ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement