Friday, May 3, 2024

వ్యభిచార గృహాన్ని సీజ్ చేసిన పోలీసులు..

జవహర్ నగర్, ప్రభాన్యూస్ : జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాజీ నగర్ లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహించిన ఇంటిని మంగళవారం ఎస్సై శివ నాగ ప్రసాద్. విఆర్వో సత్యనారాయణ తో కలిసి సీజ్ చేశారు. గత కొంత కాలంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ శివాజీ నగర్ లోని ఓఇంట్లో రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఫిబ్రవరి 15న ఆ ఇంటి పై దాడి చేయగా ఆరుగురు వ్యక్తులు, ముగ్గురు బాధితులు పట్టుబడ్డారు.

బాకాపురం ప్రసాద్ , బాక పురం జ్యోతి, వనరుల సాయి కిషోర్, వనరుల భవాని, సూర్య వంశీ దన్వీర్ లాల్ , కుప్ప భాగ్యలక్ష్మి లను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. కాగా ముగ్గురు బాధితులు భూక్య స్వాతి, కుప్ప మహేశ్వరి, వనరుల లక్ష్మి లను ఉప్పల్లోని ఉజ్వల హోంకు తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement