Saturday, May 4, 2024

ఉక్రెయిన్‌లో చిన్నారుల కిడ్నాప్‌.. మితిమీరుతున్న రష్యా ఆగడాలు

•పౌరుల కిడ్నాప్‌పై ఇప్పటికే నిషేధం
•పట్టించుకోని రష్యన్‌ ఆర్మీ
•అమెరికా ఎంబసీ ఆగ్రహం

న్యూఢిల్లి : రష్యా బలగాల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఉక్రెయిన్‌ ఆర్మీని ఎదుర్కొనే సత్తా లేక.. చిన్న పిల్లలను కిడ్నాప్‌ చేస్తున్నాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. పౌరులను కిడ్నాప్‌ చేయడంపై నిషేధం ఉన్నప్పటికీ.. రష్యా తమ పిల్లల జీవితాలను ప్రమాదంలోకి నెడుతోందని ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒలెగ్‌ నికొలెంకో ఆరోపించారు. యుద్ధం పేరిట రష్యా చేస్తున్న క్రూరమైన నేరాలను వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని అమెరికా ఎంబసీ కూడా ధృవీకరించింది. డొనెట్స్క్‌, మరియు లుహాన్స్క్‌ నుంచి సుమారు 2389 మంది పిల్లలను రష్యా దళాలు అపహరించుకుని వెళ్లాయని ప్రకటించింది. ఉక్రెయిన్‌ సైనికులతో ఢీకొట్టే సత్తా లేక రష్యా బలగాలు ఇలాంటి పిరికిపంద చర్యలకు దిగుతోందని విమర్శించింది.

అపహరించుకు వెళ్లిన పిల్లలను వెంటనే విడుదల చేయాలని అమెరికా ఎంబసీ రష్యాను సూచించింది. సాధారణ పౌరులను ఇలా కిడ్నాప్‌ చేయడం.. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపడింది. ధైర్యం ఉంటే.. ఉక్రెయిన్‌ ఆర్మీతో ధీటుగా పోరాడాలని సూచించింది. లేనిపక్షంలో పక్షంలో ఉక్రెయిన్‌ భూభాగాన్ని విడిచి వెళ్లిపోవాలని హితవు పలికింది. చిన్నారులను కిడ్నాప్‌ చేసి ఉక్రెయిన్‌పై పట్టు సాధిస్తామనుకోవడం సరికాదని చెప్పుకొచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement