Thursday, April 25, 2024

పీజీ మెడికల్‌ ప్రవేశాలకు మాఫ్‌ ఆప్‌ నోటిఫికేషన్‌ విడుదల..

•23,24వ తేదీల్లో వెబ్‌ఆప్షన్లు..

వరంగల్‌, ప్రభన్యూస్‌ : పీజీ మెడికల్‌ కన్వీనర్‌కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ మాఫ్‌ ఆప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలకు అదేవిధంగా నిమ్స్‌ మెడికల్‌ కళాశాలలోని కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. పీ జీ కటాఫ్‌ స్కోర్‌ తగ్గిన నేపథ్యంలో సర్వీస్‌ కేటగిరి అభ్యర్థులకు ఈసారి అవకాశం కల్పించారు.

సర్వీస్‌, నాన్‌ సర్వీస్‌ సీట్ల ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఈనెల 23న ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కెఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్‌.తెలంగాణ.జీఓవి.ఇన్‌లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement