Tuesday, May 14, 2024

Mark Zuckerberg | హాస్పటల్ బెడ్ పై మార్క్ జుకర్‌‌బర్గ్.. MMA ట్రైనింగ్‌లో గాయం

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. MMA ఫైట్ కోసం శిక్షణ తీసుకుంటున్న క్రమంలో జుకర్‌బర్గ్ మోకాలికి గాయం అయిన‌ట్టు తెలుస్తొంది. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న జుకర్ బర్గ్.. తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా, స్టాన్ ఫోర్డ్ మెడిసిన్ ప్రాకారం.. జుకర్‌‌బర్గ్ ACL శస్త్ర చికిత్స నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపుగా 9 నుండి 12 నెలలు పడుతుందని జుకర్‌బర్గ్ త్వరగా కోరుకోవాలని నెటిజన్లు ఆకాంక్షించారు.

జుకర్‌బర్గ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ‘మోకాలికి తగిలిన గాయానికి ACL శస్త్ర చికిత్స చేయడం ద్వారా బయటపడ్డాను.. నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న వైద్య బృందానికి కృతజ్ఞతలు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న MMA ఫైట్ కోసం శిక్షణ పొందుతున్నాను.. కానీ ఇప్పుడు అది కాస్త ఆలస్యమైంది.. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాక తిరిగి శిక్షణ ప్రారంభిస్తాను. ఈ సమయంలో ప్రేమ, మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అంటూ పోస్టు పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement