Sunday, April 28, 2024

Croma: టీ-వీలు, వాషింగ్‌ మెషీన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్లు

హైదరాబాద్‌ : ఈ దీపావళికి మీ కలలను నెరవేర్చుకోండి, టాటా ఎంటర్‌ప్రైజ్‌ అయిన క్రోమా తమ వార్షిక, ప్రతిష్టాత్మక ఫెస్టివల్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌ క్యాంపెయిన్‌తో అనేక డ్రీమ్‌ డీల్స్‌, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆఫర్‌లతో తిరిగి వచ్చింది. ఈ ఆఫర్‌లు క్రోమా స్టోర్‌లు, క్రోమా వెబ్‌సైట్‌ క్రోమా.కమ్‌ అంతటా లభిస్తాయి. స్మార్ట్‌ టీ-వీల నుండి ల్యాప్‌టాప్‌లు, వాషింగ్‌ మెషీన్‌లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, మరెన్నో విభాగాలలో 15 నవంబర్‌ 2023 వరకు ఇవి అందుబాటు-లో ఉంటాయి.

వినియోగదారుల కేంద్రీకృత సంస్థగా ఉండాలనే తమ నిబద్ధతకు అనుగుణంగా ఈ ఆఫర్స్‌, డీల్స్‌ క్రోమా స్టోర్‌లు, వెబ్‌సైట్‌ క్రోమా.కమ్‌, టాటా న్యూలో అందుబాటులో ఉంటాయి. అద్భుతమైన డిస్కౌంట్‌లు, ఆఫర్‌ల శ్రేణితో మీ కలలను నిజం చేయడానికి క్రోమా సిద్ధంగా ఉంది. అన్ని ఆఫర్‌లు షరతులకి లోబడి ఉంటాయి. 55, 65, 75 4కే ఎల్‌ఈడీ టీ-వీల ఆకర్షణీయమైన శ్రేణితో మీ హోమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మరింత సమున్నతం చేసుకోండి, ఇప్పుడు సౌకర్యవంతమైన ఈఎంఐ ఎంపిక, నెలకు కేవలం రూ.2990తో మీరు వీటిని సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్‌ టీవీలను ఇష్టపడే వారికి, ప్రత్యేక ట్రీట్‌ ఉంది. సొగసైన 55 శాంసంగ్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్రేమ్‌ టీవీని అదే నెలవారీ మొత్తానికి మీ సొంతం చేసుకోవచ్చు. రూ.8990 విలువైన ఉచిత బెజెల్‌ను సైతం పొందవచ్చని ఆసంస్థ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement