Tuesday, May 14, 2024

Head to Head | రేపే భార‌త్ – సౌతాఫ్రాకా పోరు.. త‌ల‌ప‌డ‌నున్న టేబుల్ టాప‌ర్స్

భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న ఈ ప్రపంచకప్‌లో భారత్ – సౌతాఫ్రికా జ‌ట్లు దూకుడుమీదున్నాయి… ఒక్క జట్టు త‌మ ప్ర‌త్య‌ర్థుల‌కు హై టార్గెట్‌ని సెట్ చేసి బెదరకొడుతుండగా.. మరో జట్టు చేజింగ్ లో అదరకొడుతొంది. మరి ఈ రెండు జట్లు హెడ్ టూ హెడ్ తలపడితే ఎలా ఉంటుందో అని క్రికెట్ అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. ప్రపంచకప్‌లో హైలెట్‌ మ్యాచ్‌గా భావిస్తున్న పోరులో కోల్‌కత్తా ఈడెన్‌గార్డెన్స్ వేదికగా.. సౌతాఫ్రికా – భారత్ రేపు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన భారత్ – దక్షిణాఫ్రికా జట్లు అగ్రస్థానం కోసం పోటీ పడబోతున్నాయి. అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న ఇరు జట్లు ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆటలో దూసుకుపోతున్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్‌కు ముందు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది.

- Advertisement -

2011 ప్రపంచకప్‌లో ఒక్క దక్షిణాఫ్రికా చేతిలోనే టీమిండియా ఓడిపోయింది. ఆ ఓటమికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని భారత్‌ చూస్తోంది. బ్యాటింగ్‌లో భారత జట్టు చాలా బలంగా ఉంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్‌లతో బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. ఇటు టీమిండియా బౌలింగ్‌ విభాగం కూడా పిచ్‌పై దిగిన బ్యాటర్లను త్వ‌ర‌గా ఔట్ చేస్తూ పెవిలియ‌న్ కు పంపిస్తున్నారు. బెదరకొడుతున్నారు. ఆడిన మూడు మ్యాచుల్లో మహమ్మద్ షమీ రెండుసార్లు అయిదు వికెట్లు తీసి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. బుమ్రా, సిరాజ్‌ కూడా మెరుపులు మెరిపిస్తున్నారు. కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా కూడా రాణిస్తుండడంతో టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది.

దక్షిణాఫ్రికా కూడా బలంగానే

ఒక నెదర్లాండ్స్‌తో మినహా మిగిలిన అన్ని మ్యాచుల్లో దక్షిణాఫ్రికా అన్ని విజయాలే సాధించింది. పవర్ హిట్టర్లతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్.. భారత బౌలర్లకు సవాల్‌ విసరనుంది. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు 428/ దక్షిణాఫ్రికా పేరు మీదే ఉంది. డి కాక్ ఏడు మ్యాచ్‌ల్లో 545 పరుగులతో ఈ ప్రపంచకప్‌లో టాప్‌ రన్‌ స్కోరర్‌గా ఉన్నాడు. కానీ లక్ష్యాన్ని ఛేదించడంలోనే సౌతాఫ్రికా ఇబ్బంది ప‌డుతోంది. దక్షిణాఫ్రికా పాకిస్థాన్‌పై చివరి వికెట్‌కు విజయం సాధించింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో రెండోసారి బ్యాటింగ్‌ తేలిక కాబట్టి టాస్‌ కీలకంగా మారనుంది.

అంచ‌నా జ‌ట్లు..

భారత్ జట్టు: రోహిత్ శర్మ ( కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ

దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్‌), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, ఐడెన్ మాక్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎంగిడి, కగిసో రబాడ, షంసీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, లిజాద్ విలియమ్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement