Thursday, May 2, 2024

HYD | రేపు పెట్‌స్టార్‌ మారథాన్‌.. నెక్లెస్‌ రోడ్డులో ఉదయం 7 గంటకు ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ కానిన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నవంబర్‌ 5 న ఆదివారం ఉదయం 7 గంటలకు మాన్ కైండ్‌ పెట్‌స్టార్‌ మారథాన్‌ జరగనుంది. నెక్లేస్‌రోడ్‌లోని రైల్‌కోచ్‌ రెస్టారెంట్‌ నుంచి ఈ పెట్‌ స్టార్‌ మారథాన్‌ మొదలుకానుంది. మ్యాన్‌కైండ్స్‌ పెట్‌స్టార్‌ మారథాన్‌ డాగ్స్‌ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ తోపాటు కుక్కల సంఖ్యను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్నట్లు జంతు ప్రేమికుడు చీకోటి ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ఈ మారథాన్‌లో మిస్టర్‌ పెట్‌స్టార్‌, ఎంఎస్‌ పెట్‌స్టార్‌, బెస్ట్‌ పప్పీ, బెస్ట్‌ రెస్క్యూ మరియు బెస్ట్‌ వెటరన్‌ వంటి వివిధ విభాగాల్లో అవార్డులు అందించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement