Thursday, May 2, 2024

సీఎం జగన్‌ను కలిసిన హీరో మంచు మనోజ్

ఏపీ సీఎం జగన్‌ను హీరో మంచు మనోజ్ కలిశాడు. ఈ విషయాన్ని మంచు మనోజ్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ‘దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి జగన్ గారిని కలవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని మనోజ్ ఈ సందర్భంగా తెలిపాడు. రానున్న సంవత్సరాల్లో చేయబోతున్న పనుల గురించి సీఎంగారి నుంచి తెలుసుకున్నానని చెప్పాడు. ‘సార్ మీరు అనుకున్న అన్ని పనులను నిర్విఘ్నంగా పూర్తి చేసే శక్తిని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని మనోజ్ ట్వీట్ చేశాడు. జగన్ పాలనకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు మంచు మనోజ్ చెప్పాడు. కాగా మంచు మనోజ్ సీఎం జగన్‌ను కలవడానికి గల కారణాలు తెలియలేదు.

ఈ వార్త కూడా చదవండి: అనారోగ్యం నుంచి కోలుకున్న సైరాభాను.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Advertisement

తాజా వార్తలు

Advertisement