Saturday, October 12, 2024

బ్యాంకులో బంగారం మాయం

గుంటూరు జిల్లా బాపట్లలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం మాయం కలకలం రేపింది. దీంతో బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ. 2 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం మాయమైంది. బ్యాంక్ ఉద్యోగే కారణమని గుర్తించిన అధికారులు బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో అధికారులు ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడికి సహకరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బ్యాంకు ఖాతాదారులు భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement