Thursday, April 25, 2024

డైరెక్టర్ శంకర్ కూతురు సినిమా ఫస్ట్ లుక్ విడుదల

పాన్ ఇండియా డైరెక్టర్ శంక‌ర్ ఇన్నాళ్ల‌కు త‌న కూతురిని వెండితెర‌కు ప‌రిచ‌యం చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. అదితి శంక‌ర్.. 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న విరుమ‌న్ చిత్రంతో వెండితెర‌కు ప‌రిచ‌యం కాబోతుంది. “కొంబన్” దర్శకుడు ముత్తయ్య.. కార్తీ హీరోగా సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రకాష్ రాజ్, సూరి, అదితి శంకర్ ఇతరులు కూడా ఈ చిత్రంలో భాగం కానున్నారు. అయితే విజనరీ డైరెక్టర్ శంకర్ కుమార్తె ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది.

డైరెక్టర్ శంక‌ర్‌కు ముగ్గురు సంతానం కాగా, కుమారుడు అర్జిత్, కుమార్తెలు ఐశ్వర్య శంకర్, అదితి శంకర్ ఉన్నారు. పెద్ద కుమార్తె ఐశ్యర్య వివాహం ఇటీవ‌ల‌ క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌తో జ‌రిగింది. అదితి వెండితెర ఎంట్రీ ఇస్తుంద‌నే విష‌యాన్ని తెలియ‌జేస్తూ .. ఆమె పోస్టర్ ను రివీల్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో “విరుమన్” ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోతోంది. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ 18న ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. గతంలో కార్తీ, దర్శకుడు ముత్తయ్య కాంబోలో “కొంబన్” మూవీ తెరకెక్కింది. స్టూడియో గ్రీన్ నిర్మించిన ఫ్యామిలీ ఓరియెంటెడ్ డ్రామాలో కార్తీ గ్రామీణ యువకుడిగా కన్పించాడు. మరోసారి కార్తీ, ముత్తయ్య కాంబినేషన్ రిపీట్ అవుతుండడం అంచనాలను పెంచేస్తోంది.

ఇది కూడా చదవండి: బాత్ రూమ్ లాక్ చేసి ఉండటంతో ల్యాండయిన విమానం..

Advertisement

తాజా వార్తలు

Advertisement