Monday, April 29, 2024

మ‌లాలా యూసెఫ్‌జాయ్ పై తాలిబ‌న్ల దాడికి 9 ఏళ్లు..

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మ‌లాలా యూసెఫ్‌జాయ్ తాలిబన్ల దాడిలో గాయపడి నేటికి 9 సంవత్సరాలు. ఆఫ్ఘ‌నిస్తాన్లో మాత్ర‌మే కాకుండా పాక్‌లోనూ తమ ఉనికిని చాటుకున్న తాలిబ‌న్లు 9 ఏళ్ల క్రితం పాక్‌లోని క్వెట్టా ప్రాంతంలోకి ప్ర‌వేశించి స్కూల్ బ‌స్సుపై కాల్పులు జ‌రిపారు. ఆ కాల్పుల్లో విద్యార్థిని మ‌లాలా యూసెఫ్‌జాయ్ తీవ్రంగా గాయ‌పడ్డారు.   ఆ త‌రువాత ఆమెను పెషావ‌ర్ ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందించారు. అక్క‌డి నుంచి లండ‌న్ తీసుకెళ్లి అక్క‌డ ఆప‌రేష‌న్ చేయ‌డంతో మ‌లాలా కోలుకున్న‌ది. అయితే ఇప్ప‌టికీ త‌ల‌కు త‌గిలిన బుల్లెట్ గాయం కార‌ణంగా మ‌లాలా ఆరోగ్య‌స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటోంది. రెండు వారాల క్రితం ఆమేకు మ‌రో ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. ఆమెకు ఆప‌రేష‌న్ నిర్వ‌హించే స‌మ‌యంలో తాలిబ‌న్లు ఆఫ్ఘ‌నిస్తాన్‌ను ఆక్ర‌మించుకున్నార‌ని వార్త‌లు తెలియ‌డంతో మ‌లాలా తీవ్ర ఆవేద‌నను వ్య‌క్తం చేసింది.  ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఆఫ్ఘ‌న్ ప్ర‌జ‌లు తుపాకీ తూటాల శ‌బ్దాల‌కు భ‌య‌ప‌డిపోతున్నార‌ని, వాది ఆవేద‌న అర‌ణ్య‌రోద‌న‌గా మారింద‌ని అన్నారు. 

ఇది కూడా చదవండి: ఎంసెట్ లో ర్యాంక్ రాలేదని విద్యార్థిని ఆత్మహత్య

Advertisement

తాజా వార్తలు

Advertisement