Saturday, April 27, 2024

బిగ్‌బాస్-5 సీజన్ ప్రారంభ తేదీ వచ్చేసింది

ఇండియా వ్యాప్తంగా అన్ని భాషలలో రియాలిటీ షో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిన విషయమే. తెలుగులోనూ ఈ షో అత్యంత ప్రేక్షకాదారణ పొందింది. గతంలో నాలుగు సీజన్‌లను పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ ఇప్పుడు ఐదో సీజన్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే స్టార్ మా విడుదల చేసిన ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. అక్కినేని నాగార్జున సీజన్ 5కు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు.

తాజాగా బిగ్ బాస్ 5 నుంచి మరో అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఈ బిగ్ బాస్ 5 రియాలిటీ షో సెప్టెంబర్‌ 5 నుంచి ప్రారంభం కానున్నట్లు స్టార్ మా బృందం ప్రకటించింది. ఈ షో సెప్టెంబర్‌ 5న సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్నట్లు స్టార్ మా బృందం ప్రకటించింది. ఇక సోమ నుంచి శుక్ర వారం వరకు రాత్రి 10 గంటలకు ఈ షో ప్రారంభం కానుండగా… శని, ఆదివారాల్లో మాత్రం రాత్రి 9 గంటలకు ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. ఈ షో కంటెస్టెంట్లపై సోషల్ మీడియాలో ఇప్పటికే పలు రకాలుగా వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన వార్తలకు సెప్టెంబర్ 5తో చెక్ పడనుంది. ఆ రోజే కంటెస్టెంట్ల వివరాలు బయటకు రానున్నాయి.

https://twitter.com/StarMaa/status/1430769713517240323
Advertisement

తాజా వార్తలు

Advertisement