Sunday, April 28, 2024

మాజీ భ‌ర్త‌కి హ‌గ్ ఇచ్చిన మ‌లైకా.. మ‌ళ్ళీ క‌లిసేనా..!

బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా త‌న భ‌ర్త అర్భాజ్ ఖాన్ తో 2017 లో విడాకులు తీసుకుంది. తాజాగా అర్భాజ్ ఖాన్ .. మలైకాల‌ తనయుడు అర్హాన్ విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో మరోసారి వీరు కలిశారు. కొడుకు అర్హాన్ విదేశాలకు వెళ్తుండగా ఎయిర్ పోర్ట్ కు మలైకా .. అర్భాజ్ ఖాన్ లు వెళ్లారు. అక్కడ కొడుకుకి సెండాఫ్ ఇచ్చారు. ఆ తర్వాత ఒకరినొకరు పలకరించుకుని అక్కడ నుండి వెళ్లారు. వెళ్లే ముందు ఒకరిని ఒకరు హగ్ చేసుకోవడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. నవ్వుకుంటూ మాట్లాడిన ఇద్దరు హగ్ చేసుకుని బై చెప్పుకుని ఎవరి కారు వారు ఎక్కారు. కాగా మ‌ళ్ళీ వీరు క‌లిస్తే చూడాల‌ని వారి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement