Tuesday, March 26, 2024

AP | నాకు చీర, గాజులు పంపుతానని ఓ మహిళా మంత్రి అన్నారు.. ఆడోళ్లంటే అంత లోకువెందుకు: లోకేశ్‌

త‌న‌కు చీర గాజులు పంపుతాన‌ని ఓ మ‌హిళా మంత్రి అన్నారు. చీర క‌ట్టుకుని, గాజులు వేసుకునే ఆడాళ్లంటే చేత‌కాని వాళ్లా? మ‌హిళా మంత్రి అయి ఉండా ఇలా ఆడాళ్ల‌ను త‌క్కువ చేసి మాట్లాడతారా? అని ప్ర‌శ్నించారు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌. కుప్పంలో ఇవ్వాల (శుక్ర‌వారం) ఏర్పాటు చేసిన యువగళం సభలో ప్రసంగించారు.

ఆ చీర, గాజులు పంపించండి… వాటిని మా అక్కచెల్లెళ్లకు ఇచ్చి, వాళ్ల కాళ్లకు మొక్కి గౌరవిస్తానని లోకేశ్ అన్నారు. మీ నాయకుడిలాగా తల్లీ, చెల్లిని మెడబట్టి బయటకు గెంటే వాడిని కాద‌ని విమర్శించారు. మంత్రి పదవిలో ఉన్నవాళ్లు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement