Friday, April 26, 2024

ఎస్​యూవీ కార్లపై మహీంద్ర భారీ డిస్కౌంట్.. 72వేల దాకా ప్రయోజనాలు

ఈ నెలలో కొన్ని ఎస్​యూవీ కార్లపై రూ.72వేల వరకు భారీ డిస్కౌంట్లు అందిస్తోంది మహీంద్రా అండ్​ మహీంద్రా సంస్థ. అందులో మరాజో, బొలేరో, బలేరో నియో, థార్ 4డబ్ల్యూడీ, ఎక్స్​యూవీ300 వంటి మోడల్స్​పై డిస్కౌంట్లు ఉన్నాయి. అయితే, స్కార్పియో N, స్కార్పియో క్లాసిక్, థార్ 2WD, XUV400 EV వంటి మోడళ్లపై ఎలాంటి డిస్కౌంట్స్ లేవు. ఇక, ఆసక్తి గల కస్టమర్‌లు ఈ నెల (ఏప్రిల్)లో ఈ ఎస్​యూవీ కార్లపై ఈ ఆఫర్‌లను పొందవచ్చని కంపెనీ తెలిపింది. డిస్కౌంట్ల పై పూర్తి వివరలివే..

మరాజో:

ఈ ఎంపీవీపై రూ.72వేల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఎం6 వేరియంట్​పై క్యాష్​ డిస్కౌంట్​ కూడా ఉంది. ఎం4+, ఎం2పై రూ. 34వేలు, రూ. 58వేల వరకు క్యాష్​ డిస్కౌంట్​ను పొందవచ్చు. ఈ మరాజో ఎంపీవీలో 1.5 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 123 హెచ్​పీ పవర్​ను, 300ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్​ మేన్యువల్​ గేర్​బాక్స్​ ఉంటుంది.

మహీంద్రా బొలేరో:

మహీంద్రా బొలేరోపై రూ.66వేల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. బీ6(ఓ)పై రూ.51వేల వరకు క్యాష్​ డిస్కౌంట్​తో పాటు రూ.15వేల విలువ చేసే యాక్ససరీస్​ కిట్​ ఉచితంగా దక్కించుకోవచ్చు. బీ6, బీ4పై రూ.24వేలు, రూ.37వేల వరకు ఆఫర్స్​ ఉన్నాయి. ఈ బలేరోలో 1.5 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 75 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది.

మహీంద్రా ఎక్స్​యూవీ300:

మహీంద్రా ఎక్స్​యూవీ300పై రూ.52వేల వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. డబ్యూ8 డీజిల్​ వేరియంట్​పై రూ.42వేల క్యాష్​ డిస్కౌంట్​తో పాటు రూ.10వేల యాక్ససరీస్​ కిట్​ ఉచితంగా దక్కించుకోవచ్చు. డబ్ల్యూ8(ఓ), డబ్ల్యూ6 డీజిల్​ వేరియంట్లపై రూ.22వేలు, రూ.10వేల వరకు ఆఫర్స్​ ఉన్నాయి. ఇక డబ్ల్యూ8(ఓ) పెట్రోల్​ వేరియంట్​పై రూ.25వేలు.. డబ్ల్యూ8- డబ్ల్యూ6 వేరియంట్లపై రూ.20వేల వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. మహీంద్రా ఎక్స్​యూవీ300 టర్బోస్పోర్ట్​లో 1.2 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 130హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. దీనిపై రూ.10వేల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

- Advertisement -

మహీంద్రా థార్​ 4X4:

మహీంద్రా థార్​ 4X4 మోడల్​పై రూ.40వేల వరకు డిస్కౌంట్లు ఇస్తోంది కంపెనీ.. ఇందులో 2.0 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ 2.2 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. 6 స్పీడ్​ మేన్యువల్​ లేదా 6 స్పీడ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ లభిస్తున్నాయి.

మహీంద్రా బొలేరో నియో:

మహీంద్రా బొలేరో నియోపై రూ.48వేల వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. ఇందులో 1.5 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 100 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. 5 స్పీడ్​ మేన్యువల్​ గేర్​బాక్స్​ దీని సొంతం.

ఈ డిస్కౌంట్లు నగరాలని బట్టి మారుతూ ఉంటాయి. పూర్తి వివరాల కోసం సమీప డీలర్​షిప్​ షోరూంకు వెళ్లాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement