Sunday, April 28, 2024

RR vs DC | ఢిల్లీపై 57 ప‌రుగుల తేడాతో రాజ‌స్థాన్ గెలుపు..

గువహటి వేదికగా ఇవ్వాల(శనివారం) దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌తో సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ తలపడ్డారు. కాగా, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన‌ 11వ ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ జ‌ట్టుపై రాజ‌స్థాన్ జ‌ట్టు 57 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టిన రాజ‌స్థాన్ జ‌ట్టు బ్యాట్స్ మెన్లు జాస్ బ‌ట్ల‌ర్ 79, జైస్వాల్ 60 ప‌రుగులు చేయ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్ట‌పోయి 199 ప‌రుగులు చేసింది. ఆ త‌ర్వాత 200 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ్యాటింగ్ చేప‌ట్టిన ఢిల్లీ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు న‌ష్ట‌పోయి 142 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. దీంతో రాజ‌స్థాన్ జ‌ట్టు ఢిల్లీ జ‌ట్టుపై 57 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement