Sunday, May 5, 2024

మహాప్రస్థానం అద్భుతం..సూర్యాపేట‌లో త‌నికెళ్ల భ‌ర‌ణి

(ప్రభన్యూస్‌, సూర్యాపేట ప్రతినిధి): సమయం అర్థరాత్రి 1:30 గంటలు. పట్టణప్రజలు ప్రశాంతంగా నిద్రిస్తున్న వేళ మహప్రస్థానంలో కొలువైన పరమశివుడి చెంత చిత్తం లో మునిగిపోయారు సినీ నటు-డు, కవి, రచయిత తనికెళ్ల భరణి. సూర్యాపేటలో శుక్రవారం రాత్రి జరిగిన ఓ సాహిత్యసభకు హాజరైన భరణి, అక్కడ కవుల ప్రసంగంలో మహప్రస్థానం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. వెంటనే సందర్శించాలని నిర్ణయించుకున్న ఆయన తన మనసులోని కోరికను సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి జగదీష్‌రెడ్డికి తెలిపారు. సభ అనంతరం అర్ధరాత్రి 1:30గంటలకు తనికెళ్ల భరణిని స్వయంగా మంత్రి జగదీష్‌రెడ్డి మహాప్రస్థానం వద్దకు తీసుకెళ్లారు. వాహనం దిగుతూనే ప్రస్థానంలో కొలువై ఉన్న పరమశివుడి విగ్రహాన్ని చూసి పరవశించిపోయారు భరణి. దాదాపు గంట సేపు శివ చిత్తం లో మునిగితేలారు. స్మశాన వాటిక నలుమూలలా కలియ తిరుగుతూ మహాఅద్భుతం అంటూ జాషువా పద్యాన్ని నెమరవేసుకున్నారు.
—————–
ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
కలము, నిప్పులలోనఁ గఱఁగిపోయె
ఇచ్చోటనే భూములేలు రాజన్యుని
యధికార ముద్రిక లంతరించె
ఇచ్చోటనే లేఁత ఇల్లాలి నల్లపూస
ల సౌరు గంగలోఁ గలసిపోయె!
——————–
అంటూ ఇంతటి అద్భుత మహాప్రస్థానాన్ని 20 ఏళ్ల క్రితం యూరప్‌లో చూశాను అన్న తనికెళ్ళ, అక్కడ సైతం స్మశానం ఇరుకుగా ఉందన్నారు. ఆ తర్వాత మళ్లిd సూర్యాపేటలోనే అంతటి నిర్మాణాన్ని చూస్తున్నానని తెలిపారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సువిశాలంగా, అహ్లాదకరంగా రూపుదిద్దుకున్న మహాప్రస్థాన దర్శనభాగ్యం కల్పించిన మంత్రి జగదీష్‌ రెడ్డీ…ధన్యోస్మి అంటూ ఆనందభాష్పాలతో వెనుదిరిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement