Wednesday, May 1, 2024

చంద్రగ్రహణము

ఆశ్వీయుజ శుద్ధ పూర్ణిమ శని వారం (28.10.2023) రాత్రి 1.03. లకు అశ్వనీ నక్షత్రమందు రాహగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం పడుతుంది.
— స్పర్శకాలము రాత్రి గం.1.03 ని. లు.
– మధ్యకాలం రా. 1.43 ని.లు
– మోక్షకాలం. రా. 2.21 ని.లు
– మిధునం, కన్య, మకరం, కుంభం రాశు ల వారికి శుభప్రదం.
– వృషభం, సింహ, తుల, ధనస్సు రాశుల వారికి మధ్యమం.
– మేషం, కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అరిష్టము.
ఈ గ్రహణము అశ్వనీ నక్షత్రము, మేషరాశియందు పట్టుటచే అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం నక్షత్ర జాతకులు, మేషరాశి వారు చూడరాదు. శనివారం సాయం. 5.00 గంటల లో పు భోజనాదులు ముగించవలెను. గ్రహణ సమయమున ఏమీ తినరాదు. గ్రహణము పట్టిన వెంటనే పట్టు స్నానము చేసి నవగ్రహ స్తోత్రములు, దైవ ప్రార్థనలు చదువుకొంటూ గ్రహణం విడిచిన తర్వాత మోక్ష (విడుపు) స్నానము చేయాలి.
శ్లో|| తమోమయాయ మహాభీమ సోమసూర్య విమర్దనా|
హేమతారా ప్రధానేన మమ శాంతి ప్రదోభవ||
విధుంతుద నమస్తుభ్యం సింహికానాందనాచ్యుతా
దానేన నేననాగస్య రక్షమాం వేదజాద్భయాత్‌|| 29.10.23వ తేదీ ఆదివారం యథాశక్తిగా బియ్యం, వస్త్రములు, వెండి, బంగారపు వస్తువులు పై మంత్రం చెబుతూ దానమీయవలెను .

Advertisement

తాజా వార్తలు

Advertisement