Wednesday, February 8, 2023

బిఆర్ఎస్ పై ‘మ‌హా’అస‌క్తి..

ఉమ్మడి నిజామాబాద్‌, ప్రభన్యూస్‌: భారత రాష్ట్ర సమితి లో చేరేందుకు మహారాష్ట్రలో నేతలు ఆసక్తి చూపుతున్నారు. నేతలతో పాటు మరాఠాలు బీఆర్‌ఎస్‌ను స్వాగతిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వా త మహారాష్ట్ర నుంచి మంచి స్పందన వచ్చింది. తెలంగాణకు పొరుగున ఉన్న మహారాష్ట్రలో ఎంట్రీ ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే ప్లాన్‌ చేసింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో అడుగుపెట్టబోయే బీఆర్‌ఎస్‌కు ఇప్పటి నుంచే మద్దతు వస్తోంది. ఈ పరిమాణం బీఆర్‌ఎస్‌కు కలిసిరానుంది. ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్‌ నుంచి జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌గా అవతరించిన తర్వాత మొదట పొరుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టేందుకు అధినేత కేసీఆర్‌ ప్లాన్‌ వేసినట్లు తెలిసింది. మొదట మహారాష్ట్ర నుంచే బీఆర్‌ఎస్‌ ప్రస్థానం మొదలుపెట్టాలనే ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు తెలిసింది.

- Advertisement -
   

మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మహారాష్ట్రతో తెలంగాణ రాష్ట్రా నికి అనేక ఏళ్లుగా బంధం పెనవేసుకుంది. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య బంధు త్వం, స్నే#హం, వ్యాపార సంబం ధాలు ఉన్నాయి. పొరుగు గ్రామాల్లో అయితే తెలుగు మాట్లాడే మరాఠాలు, మరాఠీ మాట్లాడే తెలుగు వారు భారీ సంఖ్యలో వున్నారు. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తూనే ఉంటారు. లక్షల సంఖ్యలో మహారాష్ట్రలోని ప్రధాన నగరా లైన ముంబై, పుణ, నాగపూర్‌, ఔరంగాబాద్‌, షోలాపూర్‌, నాసిక్‌ తదితర పట్టణాల్లో తెలంగాణ ప్రజలు లక్షల సంఖ్యలో స్థిరపడ్డవారున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడ్డవారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఈ నేపథ్యంలో తొలుత మహారాష్ట్రలో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు యుద్ధప్రాతి పదికన కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఒక్కో రాష్ట్రంలో వెనువెంటనే అడుగులు వేసి పార్టీని బలోపేతం చేసేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ నుంచి కీలక నేతలు బీఆర్‌ఎస్‌ పార్టీలో కేసీఆర్‌ సమక్షంలో చేరిపోయా రు. మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరు గుతోంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచే చేరికల పరంపర కొనసాగుతుం టే, ఇక మహారాష్ట్రలో భారీగా చేరికలు జరగవచ్చనే అంచ నాలు ఉన్నాయి. కేసీఆర్‌ సర్వేలో కూడా మహారాష్ట్రలో విపరీ తమైన క్రేజ్‌ ఉందని తేలినట్లు తెలిసింది. ఇందుకోసం బీఆర్‌ ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా నేతలకు దిశానిర్ధేశం చేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర బాధ్య తలను ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల నేతలకు అప్పగించే యోచనలో చేయనున్నట్లు సమాచారం.
చేరికలపై మరాఠా నేతల మంతనాలు… పోటీకి ఆశావహులు
నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు మహారాష్ట్ర లోని పొరుగు గ్రామాల, పట్టణాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. పనుల నిమిత్తం రాకపోకలు నిత్యం జరగడంతోపా టు వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయి. రాజకీయమైన సం బంధాలు కూడా కొనసాగుతు న్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాజకీయపరమైన బంధాలు మరింత బలపడ్డాయి. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల ప్రచారానికి మహారాష్ట్రకు నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి వెళ్లేవారు.. ఇప్పటికీ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఎంట్రీతో మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు మారను న్నాయని స్పష్టంగా తెలుస్తోంది. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత పొరుగున ఉన్న మహారాష్ట్ర గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని అక్కడి ప్రజలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నిజమాబాద్‌ ఎమ్మెల్యేలకు, అప్పటి ఎంపీ కవితకు వినతిపత్రాలను అందజేశారు. అనేక గ్రామాల్లో ప్రజలు తీర్మానాలు చేశారు. అప్పటి నుంచి బీఆర్‌ఎస్‌తో మహారాష్ట్ర లోని అనేకమంది నేతలు టచ్‌లో ఉన్నారు.

పొరుగు పట్టణాలు కాకుండా మహారాష్ట్రలోని అనేక పెద్ద నగరాల్లో, పట్టణాల్లో తెలంగాణకు చెందిన లక్షలమంది స్థిర పడ్డారు. ఇలా తెలంగాణ- మహారాష్ట్రకు విడదీయరాని సం బంధాలు ఉన్నాయి. దీంతో మహారాష్ట్రలో చేరికలపై బీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టింది. అనేకమంది మహారాష్ట్ర నేతలు, రైతు నాయకు లు నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో చర్చలు జరిపినట్లు తెలిసింది. బీఆర్‌ఎస్‌లో చేరేందుకు మంతనాలు జరగగా, అనేకమంది సుముఖంగా ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు ఇప్పటి నుంచే బీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసేందుకు ఆశావ#హులు సిద్ధమ వుతున్నారు. ఆశావ#హులు తెలంగాణ బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతల తో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ప్రధానంగా రైతు నేతలు, వ్యాపారులు బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. త్వరలోనే మహారాష్ట్ర నుంచి బీఆర్‌ఎస్‌లో చేరే నేతల సంఖ్యను అధినేతకు అందించే పనిలో ఉన్నట్లు సమాచారం.
ఖమ్మం సభ తర్వాత భారీ బహిరంగ సభ
బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు తర్వాత ఢిల్లిdనే రైతులతో మొదటగా భారీ సభను నిర్వహంచాలని భావించారు. అయితే ఢిల్లికి బదులుగా మొదట మహారాష్ట్రలోని నాందేడ్‌లో పెద్ద ఎత్తున సభను నిర్వహంచి ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టాలని భావించి నట్లుగా చర్చ జరిగింది. ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ అనంతరం నాందేడ్‌ లేదా ముంబైలో భారీ సభను ఫిబ్రవరి మొదటి లేదా రెండవ వారంలో నిర్వ#హంచాలని గులాబీ బాస్‌ యోచిస్తున్నట్లు తెలిసిం ది. నిజామాబాద్‌ పొరుగునే ఉన్న నాందేడ్‌ జిల్లాతో పాటు పర్భని, దేగ్లూర్‌ ఆదిలాబాద్‌ జిల్లా సరి#హద్దులో ఉన్న కిన్వట్‌ ప్రాంతం నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికలు జరిగిన తర్వాత నాందేడ్‌ కేంద్రంగా భారీ బ#హరంగ సభకు ప్రణాళికలు సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకోసం నిజామాబాద్‌ జిల్లా మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించే అవ కాశం ఉంది. కామారెడ్డి జిల్లా పొరుగునే ఉన్న దేగ్లూర్‌, నిజామాబాద్‌ పొరుగునే ఉన్న పర్భని, ధర్మాబాద్‌, ముఖేడ్‌లో జిల్లాకు చెందిన నేతలకు మంచి సంబం ధాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే గతంలో నాందేడ్‌ జిల్లాతోపాటు ఔరంగాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు తెలంగాణ ప్రాంతంలో ఉండేవి. ఈ సెంటిమెంట్‌ కూడా అక్కడ వర్కౌట్‌ అవుతుందన్న నమ్మకం ఉంది. ఇప్పటికే పొరుగున మహారాష్ట్ర జిల్లాలతో పాటు అనేక గ్రామాలు తెలంగాణపై వ్యాపారంగా, వ్యవసాయపరంగా ఆధారపడి ఉన్నాయి. ఈ పరిస్థితులు బీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అవకాశం
స్పష్టంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement