Wednesday, May 1, 2024

కుమారుడిని ప్రేమించిందని… నగ్నంగా చేసి…చితకబాది…ఆపై…..

జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిధి జిల్లాలో దారుణం జరిగింది. ఓ కుటుంబంలోని నలుగురు తమ కుమారుడితో ప్రేమ వ్యవహారంలో 26 ఏళ్ల యువతిని అడవిలోకి తీసుకెళ్లి చితకబాది వివస్త్రురాలిని చేసి చెట్టుకు కట్టేసి వెళ్లిపోయిన సంఘటన సంచలనం సృష్టించిందిపోలీసులు ఆ యువతిని రక్షించి వైద్యం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ఆ నలుగురిలో యువతి ప్రియుడు కూడా ఉన్నట్లు తెలిపారు పోలీసులు. బాగోడార్ షబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ నౌషాద్ అలామ్ తెలిపిన వివరాల ప్రకారం సారియా పోలీస్ స్టేషన్ పరిధిలో 26 ఏళ్ల బాధితురాలు ఒక యువకుడితో ప్రేమలో పడింది.

ఈ వ్యవహారం గురించి తెలుసుకున్న అతని కుటంబసభ్యులు.. తండ్రి, తల్లి, సవతి తల్లి కుమారుడిని మందలించి ఆ యువతిని ఇంటికి రప్పించమన్నారు. వెంటనే వారి కుమారుడు ఆమెకు కబురు పంపగా బుధవారం అర్ధరాత్రి ఆమె ఇంటికి చేరుకోగానే నలుగురు కలిసి దౌర్జన్యంగా బంధించి సమీపంలోని అడవికి తీసుకుని వెళ్లారు.
అక్కడ ఆమె ప్రియుడితో సహా కుటుంబసభ్యులంతా ఏకమై ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి బట్టలను చింపివేశారని అవమానంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని భావించి యువతిని చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించామని.. ఆమె ప్రియుడిని, అతడి తండ్రిని, తల్లిని, సవతి తల్లిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement