Sunday, May 19, 2024

ఫ్రాన్స్​ లో మళ్లీ లాక్​ డౌన్​..

ఫ్రాన్స్ లో మరోసారి లాక్ డౌన్ విధించారు ఆ దేశ ప్రధాని… కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. కరోనా థర్డ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు తెలిపారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్. ఇప్పుడు చర్యలు చేపట్టకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని ఆయన అన్నారు. కరోనాను అడ్డుకోవాలంటే ఇదే మంచి నిర్ణయమన్నారు. ఇక ప్రాన్స్ లో మరో మూడు వారాల పాటు పాఠశాలలను మూసేస్తున్నారు. చాలా నెలల పాటు స్కూళ్లను తెరిచే ఉంచామని, అయినా కూడా పొరుగు దేశాలతో పోలిస్తే కరోనా మహమ్మారిని కట్టడి చేయగలిగామని ఆయన గుర్తు చేశారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ను వేగవంతం చేస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement