Monday, May 6, 2024

Local Election – కెసిఆర్ హవా – 15 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం

విదర్భ – అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర గడ్డపై గులాబీ జెండా పాతింది. మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 15 స్థానాలను కైవసం చేసుకుంది.. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత.. తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్ర గ్రామాలను టార్గెట్ చేసిన కేసీఆర్ స్వయంగా అక్కడికి వెళ్లారు. సభలు సమావేశాలు నిర్వహించారు. ఇక్కడి పథకాల పట్ల అక్కడి ప్రజలు కూడా ఆకర్షితులయ్యారు. త్వరలోనే మహారాష్ట్రలో బీఆర్ఎస్ జెండా పాతుందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 15 చోట్ల విజయం సాధించింది.

పంచాయతీ ఎన్నికల్లో శివసేన-బిజెపి, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గాలు అత్యధిక సీట్లలో విజయం సాధించాయి. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. విదర్భ, షోలాపూర్లో 15 గ్రామ పంచాయతీ స్థానాలను కేసీఆర్ పార్టీ గెలుచుకుంది. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే కంచుకోటలోనూ సీట్లు గెలవడం హాట్ టాపిక్‌గా మారింది.

ఎంఐఎం తర్వాత మహారాష్ట్రలో అడుగుపెట్టిన రెండో దక్షిణాది పార్టీ బీఆర్ఎస్సే..! మహారాష్ట్రలో ఎంఐఎం ఇప్పటికే ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేసీటులో విజయం సాధించింది. తెలంగాణలో ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలు మహారాష్ట్రలోనూ కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ముందుకు సాగవచ్చయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. మహారాష్ట్రలో 15 సర్పంచ్ సీట్లు గెలవడంతో.. గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement