Sunday, April 28, 2024

యువతి, యువకుల సహజీవనంపై హైకోర్టు కీలక తీర్పు

యువతి, యువకులు హజీవనం చేయడం సామాజికంగా, నైతికంగా అంగీకారయోగ్యం కాదని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పు వెలువరించింది. సహజీవనం చేయడానికి కోర్టు అంగీకారాన్ని కోరడం సరికాదని, సహజీవనం చేస్తున్న వారికి తాము రక్షణ కల్పించలేమని పేర్కొంది. ఓ యువజంట పెద్దల నుంచి దూరంగా పారిపోయి సహజీవనం చేస్తోంది. తామిద్దరం కలసి ఉంటున్నామని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని హైకోర్టులో వీరిద్దరూ పిటిషన్ వేశారు. అమ్మాయి కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు సహజీవనం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేస్తూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది.

మరోవైపు సహజీవనానికి అనుకూలంగా సుప్రీంకోర్టు గతంలో తీర్పు వెలువరించింది. మేజర్లుగా ఉన్న యువతి, యువకులు పెళ్లి చేసుకోకపోయినా, పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే హక్కు ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. సహజీవనం మన దేశంలో ఆమోదయోగ్యం కాకపోయినా పాపం మాత్రం కాదని చెప్పింది. మేజర్ యువతి తనకు నచ్చిన తోడును ఎంచుకోవచ్చని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement