Monday, April 29, 2024

వ్యాక్సిన్ వేసుకున్న నయన్

కరోనా కట్టడికి వ్యాక్సింగ్ కచ్చితంగా వేసుకోవాలని అధికారులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినీ రాజకీయ ప్రముఖులు కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని పిలుపునిస్తున్నారు. వారు కూడా వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. తాజాగా సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార తాజాగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. తన ప్రియుడు విగ్నేష్ తో కలిసి నయన్ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారు.

అందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక గత కొన్ని గత కొన్నాళ్లుగా డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో నయనతార ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement