Thursday, April 25, 2024

సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ ట్రైలర్ వచ్చేసింది

మ‌నోజ్ బాజ్‌పాయ్ ప్ర‌ధాన పాత్ర‌లో వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఎంత పెద్ద స‌క్సెస్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్కర్లేదు. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ రూపొందుతోంది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను ఈరోజు అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది. ఇందులో సమంత పాత్ర హైలైట్. సమంత ఈ వెబ్ సిరీస్‌లో నెగిటివ్ పాత్రలో కనిపిస్తోంది. ప్రియమణి, షరీబ్ హష్మి, శరద్ కేల్కర్, శ్రేయా ధన్వంతరి తదితరులు ఇందులో ముఖ్య పాత్ర‌లు పోషించారు. రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు.

రెండు నెల‌ల క్రిత‌మే అమెజాన్ ప్రైమ్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కావాల్సింది. అయితే ‘మీర్జాపూర్‌’, ‘తాండవ్‌’ వెబ్‌సిరీస్‌ల వల్ల అమెజాన్‌ ప్రైమ్‌ మీద వచ్చిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో కొద్ది రోజుల పాటు వాయిదా వేసిన‌ట్టు తెలుస్తుంది. కాగా జూన్ 4 నుండి అమెజాన్‌లో ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్న‌ట్టు తెలుస్తోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement