Friday, April 26, 2024

లిథియం నిల్వలను వేలం వేయనున్న కేంద్రం

జమ్ము : ఇటీవల జమ్ములో భారీ స్థాయిలో కనుగొన్న లిథియం నిల్వలను కేంద్రం వేలం వేయనుంది. జూన్‌లో ఈ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. లిథియంను ఈవీ వాహనాల్లో వినియోగించే బ్యాటరీల తయారీలో వాడతారు. జమ్ములో లిథియం నిల్వలు గణనీయంగా ఉన్నాయని , ఈ క్లిష్టమైన నాన్‌ ఫెర్రస్‌ మెటల్‌ను త్వరలోనే వెలికి తీసే పనులు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నిల్వలను వెలికి తీసేందుకు బ్లాక్‌ల వారిగా వేలం వేయనున్నారు.
ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్‌వర్క్‌ వర్గీకరణ ప్రకారం గనులను నాలుగు విధాలుగా పేర్కొంది. జీ4 అంటే కనుగొనడం, జీ3 ప్రాస్పెక్టింగ్‌, జీ2 సాధారణ అన్వేషణ, జీ1 వివరణాత్మక అన్వేషణగా పేర్కొంది.


జమ్ముకాశ్మీర్‌లోని రెసీ ప్రాంతంలో 5.9 మిలియన్‌ టన్నుల నిల్వలను కనుగొన్నారు. లిథియం అధికంగా కలిగి ఉన్న దేశాల్లో మన దేశం ఈ నిల్వలతో 7వ స్థానంలోకి వచ్చింది. మన దేశంలో ఇప్పటి వరకు లిథియం రిఫైనరీలు లేవు. నిల్వలు కూడా లేవు. మొదటి సారి జమ్ములో వీటిని కనుగొన్నారు. ప్రభుత్వం ఈ నిల్వలను దేశీయంగానే రిఫైనరీ చేయాలని భావిస్తోంది. అంటే ఇందు కోసం ప్లాంట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటిని రిఫౖౖెన్‌ చేసిన తరువాత ఈవీ వాహనాల్లో వినియోగించే లిథియం ఆయాన్‌ బ్యాటరీలను తయారు చేస్తారు. ప్రభుత్వం గ్రీన్‌ ఎనర్జీపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినందున ఈ నిల్వలను సాధ్యమైనంత త్వరగా వెలికి తీయాలని భావిస్తోంది. ప్రస్తుతం మన దేశం లిథియం ఆయాన్‌ బ్యాటరీలను పూర్తిగా దిగుమతి చేసుకుంటోంది.
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా చైనాలో ఈ
నిల్వలు ఉన్నాయి. మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో చైనా 75
శాతం వాటా కలిగి ఉంది. మన దేశానికి ప్రధానంగా హంగ్‌కాంగ్‌, చైనా నుంచే ఈ బ్యాటరీలు వస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో వీటి సరఫరాలో అంతరాయలు కలగడంతో రేట్లు పెరిగాయి.
ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌, హిందూస్థాన్‌ కాపర్‌, మినరల్‌ ఎక్స్‌ఫ్లోరేషన్‌ కార్పోరేషన్‌ సంయుక్తంగా రిసెర్చ్‌ అండ్‌ డెపలప్‌మెంట్‌ సంస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ రెండు సంస్థలు కలిపి జాయింట్‌ వెంచర్‌లో లిథియం ఆయాన్‌ బ్యాటరీలను తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement