Tuesday, May 7, 2024

యుద్ధం ఆపబోం.. అనుకున్నది సాధించేవరకు కొనసాగిస్తాం : రష్యా వెల్లడి..

ఉక్రెయిన్‌ భూభాగంలో ఉన్న రష్యన్‌ భాష మాట్లాడే ప్రజలున్న ప్రాంతాలకు విముక్తి కల్పించాలన్న లక్ష్యంతోసైనికచర్య ప్రారంభించిన రష్యా అది సాధించేవరకు వెనక్కు తగ్గబోమని, యుద్ధం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. నాటో కూటమిలో చేరేందుకు ఉక్రెయిన్‌ ప్రయత్నించడం, వద్దన్నా ముందుకు వెళ్లడంతో కన్నెర్ర చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ దండయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. సైనిక చర్య పేరుతో ప్రారంభించిన ఈ దండయాత్రకు అదే ప్రధాన కారణమైనప్పటికీ అసలు లక్ష్యం వేరు. రష్యాతో సరిహద్దులున్న ఉక్రెయిన్‌ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం రష్యా లక్ష్యం. 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకున్నట్లే దానికి సరిహద్దుల్లో ఉన్న తూర్పు ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసే దిశగా అడుగులు వేస్తూ కొంత ఫలితం సాధించింది.

ఫిబ్రవరి 24న మొదలైన యుద్ధం శుక్రవారంనాటికి వందవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రష్యా క్రెవ్లిున్‌ అధికార ప్రతినిధి దిమిత్ర పెస్కోవ్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌పై సైనికచర్య లక్ష్యం సాధించేవరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. డోనెట్‌స్క్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌, లుషాంక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ప్రాంతాలకు ఉక్రెయిన్‌ నుంచి విముక్తి కల్పించడం తమ లక్ష్యాల్లో ఒకటని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ రెండు ప్రాంతాలను డోనెట్‌స్క్‌, లుషాంక్‌ రీజియన్లుగా ఉక్రెయిన్‌ పాలనలో ఉన్నాయి. కానీ రష్యా వాటిని స్వతంత్ర ప్రాంతాలుగా చెబుతోంది. డాన్‌బోస్‌ రీజియన్‌లో ముందడుగు వేశామని చెప్పిన పెసకోవ్‌ ఈ యుద్ధంలో రష్యా విజయం సాధించి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement