Sunday, May 19, 2024

ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో ‘లాల్ స‌లామ్’.. ఇవ్వాల రాత్రికి బిగ్ అప్‌డేట్‌

సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలిగా విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలలో లాల్ సలామ్ అనే కొత్త ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఈ సినిమాలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా ఒక‌ అతిధి పాత్రలో క‌నిపించ‌నున్నారు. చాలా రోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు.

కాగా, ఇవ్వాల రాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో ఈ మూవీ సంబంధించిన ఒక బిగ్ అప్‌డేట్‌ను ఇవ్వ‌నున్న‌ట్టు వెల్లడించారు మేకర్స్. లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ తెలుగు నటి జీవిత రాజశేఖర్ కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీత అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement