Tuesday, May 7, 2024

మటన్ కన్నా బెండకాయలకే రేటు ఎక్కువ

బెండకాయలు రేటు ఎంత ఉంటుంది ఓ 40 నుంచి 60 రూపాయలలోపే ఉంటుంది. మహా కరువు కాలంలో అయితే 100 రూపాయలలోపే ఉంటుంది. కాని మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఏకంగా కేజీ బెండకాయల ధర 800 రూపాయలు. అందులో స్పెష‌ల్ ఏముంది అంటే అంతా స్పెష‌లే అంటున్నారు. ఎందుకంటే, ఈ బెండ‌కాయలు ఆకుప‌చ్చ రంగులో కాకుండా ఎరుపు రంగులో ఉంటాయి. సాధార‌ణ బెండ‌కాయ‌ల‌తో పోల్చితే ఇందులో ఉండే పోష‌కాలు అమోఘం. గుండెజ‌బ్బులు, ర‌క్త‌పోటు, మ‌ధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుతుంది. 40 రోజుల్లోనే ఈ పంట చేతికి వ‌చ్చిన‌ట్టు మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు చెందిన రైతు రాజ్‌పుత్ తెలిపారు. లాభసాటిగా ఉండ‌టంతో పాటుగా ఆరోగ్య‌ప‌ర‌మైన పోష‌కాలు ఉండ‌టంతో వీటిని కొనుగోలు చేసేందుకు వినియోగ‌దారులు పోటీ ప‌డుతున్నార‌ని డిమాండ్ ఉండ‌టంతో ధ‌ర‌లు అధికంగా ఉన్న‌ట్టు రైతు రాజ్‌పుత్ తెలిపారు.

ఇది కూడా చదవండి: ఏపీలో నూతన విద్యా విధానం!

Advertisement

తాజా వార్తలు

Advertisement