Monday, May 13, 2024

జనవరి19న క్షితిజ్‌ సింపోజియమ్‌.. ఖరగ్‌పూర్‌ ఐఐటీ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్ : సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లో వస్తున్న ఆవిష్కరణలు, ఆధునిక అంశాలను వివరించే, ఔత్సాహిక యువత నైపుణ్య ప్రదర్శనకు అవకాశం కల్పించే వేదికగా జనవరి19 నుంచి 21వ తేదీవరకు క్షితిజ్‌ సింపోజియం నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌ ఆసియాలోనే అతిపెద్ద టెక్నో మేనేజ్‌మెంట్‌ సింపోజియమ్‌గా చెప్పుకోవాలి. 2004 నుంచి క్షితిజ్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహోింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యువతీయువకులకు శాస్త్ర, నిర్వహణ రంగాల్లో తర్ఫీదు ఇవ్వనుంది.

ఈ కార్యక్రమంలో తమ సంస్థ చెప్పిన థింక్‌, క్రియేట్‌, ఎంజాయ్‌ అనే నినాదం ఆధారంగా వక్తలు ఉపన్యసిస్తారు. ఈ సమ్మేళనంలో ఇస్రో మాజీ చైర్మన్‌ కె.రాధాకృష్ణన్‌, స్కైరూట్‌ ఏరోస్పేస్‌ వ్యవస్థాపకుడు పవన్‌ కుమార్‌ చందన, టెక్‌ మహీంద్రాకు చెందిన అప్నీర్‌ గ్రోవర్‌ తదితరులు అతిథులుగా ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ఇస్రో, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, గ్రో వంటి దిగ్గజ సంస్థలు పాలుపంచుకున్నాయి.

- Advertisement -

గత కార్యక్రమంలో 60వేలమంది పాల్గొన్నారు. ఆ సమ్మేళనంలో రూ.45 లక్షల మేర ప్రైజ్‌మనీని విజేతలకు బహూకరించారు. రోబోవార్స్‌, శాండ్‌రోవర్‌, ఇండియా ఇన్నోవేట్స్‌, సౌర్‌ కోడ్‌ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించారు. గేమ్‌ ఫె కోం రూ.80వేలతో ప్రైజ్‌ పూల్‌తో ఇ-స్టోర్స్‌ క్లాష్‌ని ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో వాన్‌మూన్‌, స్వాట్రెక్స్‌ ఆసిమ్‌ శర్మ, శిల్పారావులతో ఈడీఎమ్‌, మెగాషోలు ఉన్నాయి. సృజనాత్మకత, ప్రతిభ, పోటీ వాతావరణం వెల్లివిరిసే ఈ కార్యక్రమం యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వివరాల కోసం డబ్ల్యూ.డబ్ల్యూ.కెటిజె.ఇన్‌లో తెలుసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement