Friday, May 3, 2024

AP | ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ..

విజయవాడ (ప్రభ న్యూస్) : కృష్ణా నది ఎగువ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివస్తున్న వరద నీటితో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. గురువారం అర్ధరాత్రి నుండి క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్న వరద ప్రవాహం శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతానికి 2 లక్షల 70 వేల క్యూసెక్కులకు చేరుకుంది. మ్యారేజి పూర్తిస్థాయి నీటిమట్టం 12 అడుగుల చేరిన నేపథ్యంలో 30 గేట్లను 7 అడుగుల మేర, 40 గేట్లను 6 అడుగుల మేర ఎత్తి దిగువకు వరద నీటిని మళ్ళిస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 2 లక్షల 70 వేల క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 2 లక్షల 60 వేల క్యూసెక్కులుగా ఉంది.

బ్యారేజీకి పెరిగిన సందర్శకుల తాకిడి..

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ సాగరంలో కలిసేందుకు పరవళ్ల తొక్కుతూ ప్రవహిస్తున్న తీరు సందర్శకులను తన్మయత్వానికి గురిచేస్తుంది. మ్యారేజి వద్ద పూర్తిస్థాయిలో 70 గేట్లను ఎత్తి దిగువకు వరదనీటిని మళ్ళిస్తున్న నేపథ్యంలో వాటిని తిలకించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున బ్యారేజీ వద్దకు తరలివస్తున్నారు. బీరబరా పారుతున్న కృష్ణమ్మను చూసి తమ సెల్ఫోన్లో బంధించేందుకు సందర్శకులు ఉత్సాహపడుతున్నారు. బ్యారేజీ పైనుండి కృష్ణమ్మ పరవళ్లను తిలకిస్తూ సెల్ఫీలను గ్రూప్ ఫోటోలను పెద్ద ఎత్తున సందర్శకులు తీసుకుంటున్నారు. మ్యారేజి వద్ద సందర్శకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు గట్టి నిగాను ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement