Tuesday, May 7, 2024

బాధపడవద్దు.. కృష్ణ , విజయనిర్మల స్వర్గంలో ఆడుతూ, పాడుతూ ఉంటారన్న రామ్ గోపాల్ వర్మ

కృష్ణ గారు, విజయనిర్మల గారు స్వర్గంలో ఆడుతూ, పాడుతూ సంతోషకరమైన సమయాన్ని గడుపుతుంటారని… అందువల్ల మనం బాధ పడాల్సిన అవసరం లేదని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. అంతేకాదు… ‘మోసగాళ్లకు మోసగాళ్లు’ చిత్రంలో కృష్ణ, విజయనిర్మల కలిసి నటించిన ‘కోరినది నెరవేరినది’ పాటను షేర్ చేశారు.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్టయిలే వేరు. ఇతరులకు భిన్నంగా వ్యవహరిస్తూ ఆయన అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల కూడా ఆయన తనదైన శైలిలో స్పందించారు. కృష్ణ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులందరూ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తుంటే… వర్మ మాత్రం బాధ పడాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement