Monday, April 29, 2024

Crackers Blast : చింత ప్రభాకర్ ర్యాలీలో అపశృతి..

సంగారెడ్డి : చింతా ప్రభాకర్ నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. పీఎస్ఆర్ గార్డెన్ నుండి సంగారెడ్డి నూతన మెడికల్ కాలేజీ వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వ‌హిస్తున్నారు. ఈ తరుణంలో బైక్ ర్యాలీ చౌరస్తా మీదుగా కలెక్టరేట్ వరకు చేరుకుంది. అభిమానులు టపాసులు కలుస్తూ సందడి చేస్తున్న తరుణంలో ఆకాశంలో పేల్చే తార జువ్వలు ప్రమాదవశాత్తు టపాసులతో ఉన్న వాహనంలో పాడడంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు ట‌పాసులకంటుకొని ఆటోలో ఉన్న బాణసంచా సామగ్రి మొత్తం పేలి అందులో ఆటోఉన్న వ్యక్తికి తీవ్ర గాయాల‌య్యాయి. అలాగే బైక్ ర్యాలీ తీస్తున్న కార్యకర్తకు చెందిన బైక్ పూర్తిగా దగ్ధం అయ్యింది. ఈ ఘటనతో కలక్టరేట్ చుట్టు పక్కల ప్రాంతంలో ఉండే ప్రజలంతా ఉల్లిక్కి పడ్డారు. దీంతో ట్రాఫిక్ జాం అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement