Saturday, December 2, 2023

Konark Express : రూ.16కోట్ల విలువైన బంగారు ఆభ‌ర‌ణాలు స్వాధీనం

భారీగా బంగారు ప‌ట్టుబ‌డింది. భువ‌నేశ్వ‌ర్ లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో భారీగా బంగారం త‌ర‌లిస్తుండ‌గా అధికారులు ప‌ట్టుకున్నారు. ఎలాంటి ధృవ‌ప‌త్రాలు లేకుండా త‌ర‌లిస్తున్న 32 కిలోల బంగారు ఆభ‌ర‌ణాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 16 కోట్లు ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు. గ‌త అర్ధ‌ రాత్రి స‌మ‌యంలో ముంబై – భువ‌నేశ్వ‌ర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో జీఆర్పీ పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించారు. న‌లుగురి ప్ర‌యాణికుల నుంచి 32 కిలోల గోల్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే బంగారు ఆభ‌ర‌ణాల‌ను త‌ర‌లిస్తున్న వ్య‌క్తులు జీఎస్టీ డాక్యుమెంట్లు చూప‌లేదు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఒడిశా జీఎస్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల‌కు అప్ప‌గించారు. మొత్తం నాలుగు బాగ్యుల్లో 8 కిలోల‌ చొప్పున బంగారం ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ఈ న‌లుగురు ముంబైకి చెందిన హ‌స్ముఖ్‌లాల్ జైన్, సురేశ్ స‌హ‌దేవ్ ఖారే, మ‌హేశ్ భోమ్సార్, దీప‌క్ ప‌టేల్ గా పోలీసులు గుర్తించారు.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement