Tuesday, May 7, 2024

Deihl | ఢిల్లీ సందర్శనలో ఖమ్మం ప్రజాప్రతినిధులు.. సమస్యలపై ఎంపీ నామాకు వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు విజ్ఞానయాత్రకు దేశ రాజధాని వచ్చారు. బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఆహ్వానం మేరకు విజ్ఞాన యాత్రలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజా ప్రతినిధుల బృందం శుక్రవారం న్యూఢిల్లీ చేరుకుంది. ఈ సందర్భంగా వారు నామ నాగేశ్వరరావుతో ఢిల్లీలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఆయనకు శాలువా కప్పి సన్మానించారు.

డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వ రరావు, అశ్వారావుపేట మండల పార్టీ అధ్యక్షులు బండి పుల్లారావు, ములకలపల్లి మండల పార్టీ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్‌రావు తదితరులు తమ ప్రాంత సమస్యలపై వినతి పత్రం అందజేసిశారు. నియోజకవర్గ సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తానని నామ నాగేశ్వరరావు ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు.

- Advertisement -

అనంతరం వారంతా న్యూఢిల్లోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించి అనేక ఆసక్తికర అంశాలు తెలుసుకున్నారు. రాష్ట్రపతి భవన్, అక్కడి మ్యూజియం, పార్లమెంట్ లైబ్రరీ, లోటస్ టెంపుల్, కాళికామాత గుడి తదితర చారిత్రక ప్రదేశాలను చూశారు. ఎంపీ నామ దగ్గరుండి పార్లమెంట్‌ లైబ్రరీకి తీసుకెళ్లి వివిధ వ్యవహారాలకు సంబంధించిన అంశాలను ప్రజాప్రతినిధులకు వివరించారు.
ఈ విజ్ఞాన యాత్రలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు (పాల్వంచ), సొసైటీ అధ్యక్షులు మండే వీర హన్మంతరావు, అన్నపురెడ్డిపల్లి అశ్వారావుపేట, దమ్మపేట, పాల్వంచ , చండ్రుగొండ, లక్ష్మీదేవిపల్లి, ములకలపల్లి మండలాల పార్టీ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు, జడ్పీటీసీలు పైడి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు విజ్ఞాన యాత్రకు వచ్చిన వారిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement