Monday, April 29, 2024

Follow up : గుజరాత్‌ ఆప్‌ సీఎం అభ్యర్థి ఇసుదాన్‌ గాధ్వి.. ప్ర‌క‌టించిన కేజ్రీవాల్‌

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) దేశ రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలికింది. దేశ రాజకీయాల్లో సరికొత్త పద్దతులను అవలంబిస్తున్న ఆప్‌… ఆయా రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికల సందర్భంగా సీఎం అభ్యర్థిని ఎన్నుకునే విషయంలో పోల్‌ నిర్వహిస్తోంది. ఇటీవలే ముగిసిన పంజాబ్‌ ఎన్నికల్లో పోల్‌ ద్వారానే భగవంత్‌ మాన్‌ను సీఎం అభ్యర్థిగా ఆప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. పంజాబ్‌ ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధించగా… భగవంత్‌ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తాజాగా గుజరాత్‌లోనూ ఆప్‌ పోల్‌ సంప్రదాయాన్నే కొనసాగించింది.

గుజరాత్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి ఇసుదాన్‌ గాధ్వి ఎంపికయ్యారు. సీఎం అభ్యర్థి కోసం ఆన్‌లైన్‌ పోల్‌ నిర్వహించిన ఆప్‌, ఆ మేరకు గాధ్విని ఎంపిక చేసింది. ఆన్‌లైన్‌ పోల్‌లో అత్యధికులు గాధ్వి వైపు మొగ్గు చేపారని పేర్కొంటూ ‘ఆప్‌’ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 16లక్షల మంది ఓటింగ్‌లో పాల్గొనగా, 73శాతం మంది అసుదాన్‌ గాధ్వి వైపు మొగ్గు చేపారని తెలిపారు.

రాజకీయ నేతగా మారక ముందు ఇసుదాన్‌ గాధ్వి జర్నలిస్టుగా పని చేశారు. ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఏర్పాటయ్యాక జర్నలిజం వృత్తికి గుడ్‌బై చెప్పి, రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ప్రస్తుతం ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. తాజా గుజరాత్‌ అసెంబ్లిd ఎన్నికల్లో ఆప్‌ తరఫున బరిలో నిలిచాడు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక అయ్యారు. దీనిపై ఆప్‌ శ్రేణుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement