Tuesday, April 16, 2024

Post Poll Survey: మునుగోడులో దూసుకు పోయిన కారు.. ఆరా మస్తాన్​ సర్వేలో ఇదే తేలింది!

మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఏ పార్టీని వరిస్తుందనే విషయంలో యావత్​ తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొన్ని సర్వే సంస్థలు పోస్ట్​ పోల్​ సర్వేలను ప్రకటించాయి. గ్రామాల వారీగా నిర్వహించిన తమ సర్వేలో ఏ పార్టీ ఆధిక్యంలో ఉండబోతోంది అన్న వివరాలను ఆరా (AARAA) సర్వే సంస్థ ఇవ్వాల (శుక్రవారం) వెల్లడించింది. ఈ సర్వే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్​ఎస్​ పార్టీ అత్యధిక మెజార్టీతో విజయం సాధించనున్నట్టు స్పష్టమవుతోంది. ఎందుకంటే కులాల వారీగా, వయస్సుల వారీగా, జెండర్​ వారీగా ఈ సంస్థ తన రిపోర్టుని తయారు చేసింది.

ఇక.. జెండర్​ వైజ్​గా చేపట్టిన సర్వేలో టీఆర్​ఎస్​ పార్టీకి 49.13శాతం మంది మగాళ్లు, 58.13శాతం మంది ఆడాళ్లు ఓటేసినట్టు తేలింది. బీజేపీకి 34.33శాతం మగాళ్లు, 29.12శాతం ఆడాళ్లు ఓటేసినట్టు సర్వేలో వెల్లడించారు. వయస్సుల వారీగా పరిశీలించినా 40.79శాతం నుంచి 64.46 శాతం వరకు వివిధ వయస్సుల వారు టీఆర్​ఎస్​ వైపే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. బీజేపీకి 26శాతం మంది మాత్రమే మొగ్గు చూపినట్టు సర్వేలో తెలిపారు.

కులాల వారీగా పరిశీలించినా.. గౌడ (48.48), మాదిగ (51.33), యాదవ (49.15), ముదిరాజ్​ (50.20), పద్మశాలి (45.05), రెడ్డి (47.68), రజక (45.47), ముస్లిం (76.47), కుమ్మరి (54.47), మాల (56.12), వైశ్య (51.85), లంబాడ (50.00), ఇతరులు (50.29)శాతంగా ఓట్లేసినట్టు సర్వేలో తెలింది. ఈ సర్వేకు సంబంధించిన మరిన్ని వివరాలు చూడొచ్చు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement