Friday, April 26, 2024

ఇండ‌స్ట్రీలోకి కీర్తి సురేష్ సిస్ట‌ర్ ఎంట్రీ.. న‌టిగా మాత్రం కాదట!

మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయ‌న‌వ‌స‌రం లేదు. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. రీసెంట్ గా నానితో దసరా సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ మూవీ భోళాశంకరలో కీలక పాత్రలో నటిస్తోంది. తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది.

ఇదిలా ఉండ‌గా.. కీర్తిసురేష్ ఫ్యామిలీ నుండి ఆమె సోదరి సినీ పరిశ్రమకు పరిచయం కానుంది. కీర్తి అక్క రేవతి సురేశ్ దర్శకురాలిగా ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇది ఫీచర్ ఫిల్మ్ కోసం కాదు. షార్ట్ ఫిల్మ్ కోసం అని తెలుస్తోంది. కీర్తి తల్లి మేనక కూడా నటి, ఆమె తండ్రి సురేష్ నిర్మాత అనే విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన కీర్తి అక్క రేవతి దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆమె తీస్తున్న షార్ట్ ఫిల్మ్ పేరు ‘థాంక్యూ’. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement