Sunday, May 5, 2024

రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోన్న – కీర్తిసురేష్ న‌టించిన ఫ‌స్ట్ మూవీ

హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నది. ఇదంతా ఇలా ఉండగా కీర్తి సురేష్ ..నేను శైలజ సినిమా కంటే ముందు తెలుగులో ఒక సినిమాలో నటించింది. కీర్తి సురేష్, నవీన్ కృష్ణ జంటగా నటించిన చిత్రం “జానకిరామ్”. ఈ చిత్రాన్ని కొత్త డైరెక్టర్ రాంప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఆ సినిమా విడుదల ఆగిపోవడం జరిగిందట. ఇప్పుడు తాజాగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా అవుతోందని సమాచారం . జానకిరామ్ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా సమాచారం. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా కీలకమైన పాత్రలో నటించడం జరిగింది. ఈ సినిమా త్వరలోనే విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు నిర్మాతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement