Saturday, May 18, 2024

మాట నిలబెట్టుకున్న కేసీఆర్‌.. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

రాష్ట్రంలోని వృద్ధులకు ఇచ్చిన మాటను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిలబెట్టుకున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పర్కొన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లిలో 160 మందికి నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ… దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ 46 లక్షల మంది పేదలకు ఆసరా పింఛన్లను అందిస్తున్నార‌న్నారు.

గత పాలకుల హయాంలో వృద్ధులకు రూ. 200 పింఛన్‌ మాత్రమే ఇచ్చారని, స్వరాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్‌ ఏకంగా రూ. 2016కు పెంచి చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఎక్కడా ఇంత భారీ మొత్తంలో పింఛన్‌లు ఇచ్చిన దాఖలాలు లేవని, అభివృద్ధి, సంక్షేమ పథకంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్‌ అందుతుందని, అర్హులు ఎవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చెసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, మండల స్థాయి అధికారులు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement