Friday, May 3, 2024

TS: నేటి సాయంత్రం ఖమ్మం నేతలతో కేసీఆర్ భేటీ.. జిల్లా రాజకీయాలపై చర్చ

బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నుంచి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలకు పిలుపు వచ్చింది. వెంటనే హైదరాబాద్ కు రావాలని వారికి ఆదేశాలు అందాయి. వీరితో ఈ సాయంత్రం పార్టీ అధినేత కేసీఆర్ భేటీ కానున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై కేసీఆర్ లోతుగా చర్చించే అవకాశముంది. తుమ్మల అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయబోయే బీఆర్ఎస్ అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొందరు సిట్టింగ్ లకు మినహా దాదాపు అందరికీ ఆయన సీట్లను ఖరారు చేశారు.

ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు వంటి వారికి టికెట్ దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. తనకు టికెట్ రాకపోవడంపై తుమ్మల ఆవేదనకు గురయ్యారు. జిల్లా ప్రజల కోసం తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. నిన్న ఆయన ఖమ్మంలో బలప్రదర్శన చేశారు. కేసీఆర్ ఫొటో, బీఆర్ఎస్ జెండా లేకుండానే ఆయన కార్యక్రమం కొనసాగింది. ఇంకోవైపు, కాంగ్రెస్ తరపున పోటీ చేయాలంటూ తుమ్మలపై ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. దీనిపై భేటీలో చర్చించే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement